top of page

Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - Naa Autograph - Part 28

Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - Naa Autograph - Part 28

Episode : 2


ఇద్దరూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి మహేష్ కూడా బయట నుండి వచ్చాడు.


హాల్లో పక్కపక్కనే కూర్చున్న సుమిత్ర, రాముల వైపు చూసి…వాళ్ళిద్దరి మొహాలు ప్రశాంతంగా ఉండటం చూసి నవ్వుకుంటూ సుమిత్ర వైపు చూసి అంతా ఓకే కదా అన్నట్టు సైగ చేసాడు.

సుమిత్ర కూడా అంతా ఓకే అన్నట్టు సైగ చేసింది…..దాంతో వాళ్ళు ముగ్గురూ కలిసి కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు.

తరువాత వాళ్ళు ముగ్గురూ రాత్రి భోజనం అయిపోయిన తరువాత కొటలోపలికి వెళ్లారు.

సుమిత్ర : మనం ఇప్పుడు సైకో మెట్రిక్ అనే పధ్దతిని ఉపయోగిస్తున్నాము…..




మహేష్ : సైకో మెట్రిక్…..అంటే….ఏంటి….

సుమిత్ర : ఈ పద్ధతిలో ఏ మనిషి అయినా సరె…..చనిపోయిన వ్యక్తి ఆత్మతో మాట్లాడగలుగుతాడు…కొద్దిసేపు ఆ వ్యక్తి మనిషిని ఆవహించి తన గురించి పూర్తిగా చెప్పేస్తాడు….మోహిని గురించిన పూర్తి వివరాలు మనకు కేవలం రంజిత్ సింగ్ యొక్క ఆత్మ ఒక్కటే మనకు చెప్పగలదు….


అంటూ సుమిత్ర అక్కడ గదిలొ ఉన్న లైట్లన్ని ఆర్పేసి రంజిత్ సింగ్ ఉన్న పెయింటింగ్ దగ్గర ఒక రౌండ్ టీపాయ్ లాంటిది వేసి దాని చుట్టూ మూడు కుర్చీలు వేసి ఒక చైర్ లో తను కూర్చుంటూ….వాళ్ళను కూడా కూర్చోమన్నది.

రాము, మహేష్ చైర్స్ లో కూర్చోగానే సుమిత్ర తన హ్యాండ్ బ్యాగ్ లో జర్నలిస్ట్ లు వాడే చిన్న రికార్డర్ తీసి టీపాయ్ మిద పెట్టి రికార్డ్ బటన్ ఆన్ చేసి టీపాయ్ మధ్యలో ఒక క్యాండిల్ వెలిగించి….వాళ్ళీద్దరి వైపు చూసి చేతులు చాపి, “ఇప్పుడు ముగ్గురం ఒకరి చేతులను ఒకరం పట్టుకుని ఉందాం.....ఇప్పుడు ఏం జరిగినా….ఎన్ని కేకలు వినిపించినా….ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి చేతులు ఒకరం విడవకూడదు….మన మధ్యలోకి వచ్చి ఎనర్జీ అనేది బయటకు వెళ్లకూడదు….” అంటూ సుమిత్ర కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతున్నది.

రాము, మహేష్ ఇద్దరూ సుమిత్ర మొహం లోకి టెన్షన్ గా ఏం జరగబోతుందా అన్నట్టు చూస్తున్నారు.

సుమిత్ర కళ్ళు మూసుకుని మంత్రాలు చదవడం మొదలు పెట్టిన ఐదు నిముషాలకు అక్కడ పక్కనే ఉన్న లైట్లు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి.

కాని తాము లైట్లు మొత్తం ఆపేసామని విషయం గుర్తుకొచ్చిన రాము మహేష్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ వాళ్ళీద్దరూ ఒకరి చేతిని ఒకరు ఇంకా గట్టిగా పట్టుకుంటూ సుమిత్ర వైపు చూసారు.

కాని సుమిత్ర మాత్రం ఇవేమి పట్టనట్టు కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతూ ఉంటుంది.

అలా మంత్రాలు చదువుతున్న సుమిత్ర ఒక్కసారిగా తలను గట్టిగా విదిలిస్తూ ఏవో మాటలు గట్టిగా అంటుంటుంది.

ఆమె ఏం చెబుతుందో అర్ధం కాక వాళ్ళిద్దరూ సుమిత్ర వైపు అలాగే గట్టిగా చేతులు పట్టుకుని చూస్తూ ఉంటారు.

అలా పది నిముషాల పాటు సుమిత్ర ఏవో మాటలు మాట్లాడుతుంటె అక్కడ గదిలో ఉన్న లైట్లు స్పీడుగా వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి.

అది చూసి రాము, “అరేయ్….చేతులు వదిలిపెట్టకు,” అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.

తరువాత సడన్ గా సుమిత్ర ముందు ఉన్న టీపాయ్ మిద తల పెట్టి కదలకుండా ఉండిపోయింది.



అలా ఒక్క నిముషం కదలకుండా ఉండిపోయిన తరువాత సుమిత్ర మళ్ళీ తల పైకెత్తి స్పీడుగా ఊపిరి పీలుస్తుండటం చూసి రాము కంగారుగా, “సుమిత్రా నువ్వు బాగానే ఉన్నావు కదా….” అనడిగాడు.

సుమిత్ర ఇక వాళ్ల చేతులు వదిలేసి, “హా…హా….అంతా బాగానే ఉన్నది….నేను బాగానే ఉన్నాను,” అంటూ వాళ్ళిద్దరి వైపు చూసి, “ఇక గెస్ట్ హౌస్ కి వెళ్దాం పదండి,” అని అనగానే ముగ్గురూ అక్కడ నుండి బయలుదేరి గెస్ట్ హౌస్ లోకి వచ్చి తమ రూమ్ లో కూర్చుని రికార్డర్ ఆన్ చేసారు.

కాని అందులో రికార్డ్ అయిన మాటలు ఏమీ అర్ధం కాకపోవడంతో రాము తల ఎత్తి సుమిత్ర వైపు, మహేష్ వైపు అయోమయంగా చూసాడు.


సుమిత్ర : దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి రివర్స్ లో ప్లే చెయ్యి…..అప్పుడర్ధం అవుతుంది….

రాము వెంటనే రికార్డ్ అయిన దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి రివర్స్ లో ప్లే చేసాడు…అప్పుడు అందులో రికార్డ్ అయిన మాటలు ముగ్గురికీ బాగా అర్ధమవుతున్నాయి….

(రికార్డ్ అయిన మాటలు….)

రికార్డర్ : ఎన్నో ఏళ్ళ నుండి నేను ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాను….చాలా ఏళ్ళ నుండి నేను మనుషులతో మాట్లాడదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను….ఎందుకంటే నా గురించి జరిగిన విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను….కాని నా మాటలు ఎవరికీ వినిపించేవి కావు….కాని మీరు చేసిన ప్రయత్నం వలన నేను మీ కంట్రోల్ లోకి వచ్చి జరిగిన విషయాలు చెబుతున్నాను. నేను మహారాజా గజసింగ్ కుమారుడు రంజిత్ సింగ్ ని….ఇప్పుడు మీకు ఒక ఆడది మా వంశం లోకి అడుగుపెట్టడం వలన ఏ విధంగా కష్టాలు పడ్డాము….ఎలా చనిపోయామో….అది ఇంకా ఆత్మ రూపంలో ఎలా బ్రతికి ఉన్నది చెప్పాలనుకుంటున్నాను….

(ఫ్లాష్ బ్యాక్ 300 ఏళ్ళు వెనక్కి)

బాహ్లిక రాజ్యం….

రాజమహల్ లో నుండి గజసింగ్ రెండవ భార్య మోహిని మాత్రం చాలా అసహనంగా ఉన్నది.


మోహిని గురించి తెలిసిన ఆమె పరిచారిక, “ఇంకొక్క సారి బాగా ఆలోచించుకోండి మహారాణీ….ఒక్కసారి బాణం ధనస్సు నుండి బయటకు వెళ్ళిందంటే దాన్ని ఆపడం ఎవరితరం కాదు….” అన్నది.

మోహిని : ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు మంధర….ఒక ఆడదానిగా నాలో ముసలి మొగుడికి భార్యగా, వాడి ఈడొచ్చిన పిల్లలకు అమ్మగా నేను ఉండలేకపోతున్నాను…ఇక నా వల్ల కాదు….ఎదైతే అది జరిగింది…నేను ముందుకు అడుగు వేయడానికే నిర్ణయించుకున్నాను…..

మంధర : కాని మహారాజు గారు యుధ్ధానికి వెళ్ళారు….ఆయన రావడానికి చాలా సమయం పడుతుంది…

మోహిని : మంచిదే కదా….ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాము….

అంతలో ఒక పరిచారిక వచ్చి మోహినికి నమస్కారం చేసి, “మహారాణీ….మీరు మీ పూజకు సిధ్ధం చేయమన్నవి అన్ని సిధ్ధం చేసాను….” అన్నది.

మోహిని సరె అని తల ఊపుతూ ఆమెని వెళ్ళిపోమని తన పరిచారిక మంధర వైపు తిరిగి, “నేను వెళ్ళి పూజ చేసి వస్తాను….నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనులు చేయి….ఎలాగైనా సరె….నేను ఈ రాజ్యాన్ని చేజిక్కించుకుని తీరతాను…” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.

రాజ్యం మొత్తంలో మోహిని గురించి మంధరకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే….మోహిని రహస్యంగా తన మహల్ లొనుండి ఒక రహస్య మార్గం అడవిలోకి ఏర్పరుచుకుని అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నది మంధరకు తప్పించి ఎవరికీ తెలియదు.



అలా మోహిని తన మహల్ లోనుండి సొరంగం ద్వారా అడవిలోకి వెళ్ళి తన క్షుద్ర పూజలు ముగించుకుని మళ్ళీ తన మహల్ లోకి వచ్చి ఏమీ జరగనట్టు అంతఃపురం పనుల్లో మునిగిపోతుంది.

ఆ తరువాత రోజు ఉదయాన్నే రాజ మహల్లో కోలాహలం మొదలయింది…..రాజు గారు యుధ్ధం నుండి ఇంకొద్ది సేపటిలో కోటకు రాబోతున్నారనే వార్త వచ్చింది.

దాంతో కోటలో ఉన్న దాసీలు అంతా నిద్ర లేచి గబగబ రెడీ అయ్యి ఆయన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


మహారాణీ మోహిని కూడా తన మొగుడికి, అతనితో పాటు వస్తున్న మొదటి కొడుకు రంజిత్ సింగ్, రెండవ కొడుకు దల్బీర్ సింగ్ కి స్వాగతం పలకాల్సి ఉన్నది.

Comentários


© 2023 by Coming Soon. Proudly created with Wix.com

  • Black Facebook Icon
  • Black Twitter Icon
  • Black Instagram Icon
bottom of page